ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.. మరో 9 మందికి పాజిటివ్

ఏపీలో పరిస్థితి రోజురోజుకు మరింత భయాందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు కంగారు పెట్టిస్తోంది. వరుసగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లోనే సుమారు పదివేల కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్‌ కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా రోజుకు 50కి పైనే ఉంటున్నాయి. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సామాన్యులతో పాటు.. ఎమ్మెల్యేలు అధికారులు పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా అసెంబ్లీలో పనిచేస్తున్న మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కు చేరుకుంది. మరికొన్ని రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి. అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతున్నందున వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అసెంబ్లీ ఉద్యోగులు కోరుతున్నారు.