ఏపీ లో 6 లక్షలకు చేరువలో కోవిడ్‌ టెస్టులు
ఏపీ లో 6 లక్షలకు చేరువలో కోవిడ్‌ టెస్టులు

ఏపీ లో 6 లక్షలకు చేరువలో కోవిడ్‌ టెస్టులు

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డుకు దగ్గరలో ఉంది. ఆరు లక్షల మార్కుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 15,188 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 5,98,474కి చేరింది. ఈ నెల 11న 5 లక్షల మార్కు చేరిన వారంలోనే మరో లక్ష పరీక్షలు నిర్వహించడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకి 11,207 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలుస్తోంది.

కొత్తగా 351 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో 5,555 కేసులు మన రాష్ట్రానికి చెందినవి కాగా, 1,253 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, 263 విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. 128 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,641కు చేరింది