కరోనాపై భారత్‌కు ఫ్రాన్స్‌ సాయం….

కరోనా సునామితో అల్లాడుతున్న భారత్‌కు సాయమందించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన మెటీరియల్‌ అందిస్తామని అమెరికా ప్రకటించగా..తాజాగా ఫ్రాన్స్‌ కూడా చేయూతనిస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన ఆరోగ్య పరికరాలు, వెంటిలైటర్స్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌ కంటైనర్స్‌, ఆక్సిజన్‌ జనరేటర్లను పంపిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్‌ మాక్రాన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ మహమ్మారిపై ఇరు దేశాలు కలిసి పోరాడి విజయం సాధిస్తాయని హిందీలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘ కరోనా వైరస్‌కు ఇక ఎవరూ బాధితులు కారు. ప్రస్తుతం భారత్‌ క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత్‌, ఫ్రాన్స్‌ ఎల్లప్పుడూ ఐక్యంగా ఉన్నాయి. మేము చేయగలిగినంత సాయం చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు.