కరోనా పోరుకు నెల జీతం విరాళంగా ఇచ్చిన నైట్‌ వాచ్‌మెన్‌

కరోనా పోరులో భాగంగా సహాయనిధికి విరాళం అందించాలన్న తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ పిలుపు మేరకు చిత్ర పరిశ్రమలోని పలువురు స్పందించారు. సూర్య, అజిత్‌, రజనీకాంత్‌ కుమార్తె వంటి వారు విరాళాలిచ్చారు. అయితే 59 ఏళ్ల ఓ సామాన్యుడు తన నెలవారి జీతాన్ని ఇచ్చి …మిగిలిన వారిలో స్ఫూర్తి నింపాడు. ముఖ్యమంత్రితో ప్రశంసలందుకున్నారు.తంగదొరై, నైట్‌ వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తుంటారు. తన నెలవారీ జీతం రూ. 10,101 ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. తాను చేసి సాయం కొంతమందికైనా సాయపడుతుందని ఉద్దేశంతో ఇచ్చానని తెలిపారు. తంగదొరై చేసిన దానం గురించి తెలిసిన ముఖ్యమంత్రి…ఆయనకు మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కరుణానిధి రాసిన పుస్తకం తిరుక్కురల్‌ కాపీని బహుమతిగా ఇచ్చారు. ఆ వాచ్‌మెన్‌ గురించి స్టాలిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.