Stock market charts are seen during the opening bell at the New York Stock Exchange (NYSE) on February 28, 2020 at Wall Street in New York City. - Losses on Wall Street deepened following a bruising open, as global markets were poised to conclude their worst week since 2008 with another rout. (Photo by Johannes EISELE / AFP) (Photo by JOHANNES EISELE/AFP via Getty Images)

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం కుప్పకూలింది.  సెన్సెక్స్ మూడు వారాల అత్యంత కనిష్టానికి క్షీణించింది. పదిరోజులుగా లాభాల్లో దూసుకెళుతున్న సూచీలు క్షీణించాయి. యూరప్‌లో కరోనా వైరస్‌, ఐటి, ఫైనాన్స్‌ రంగాల్లోని ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కొంత వెనక్కి తగ్గారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌లపై కూడా పడింది. దీంతో సెన్సెక్స్‌ 1000కి పైగా పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 11,700 దిగువకు చేరింది. సెన్సెక్స్‌ 1,097.98 పాయింట్లు – 2.69 శాతం పడిపోయి 39,696.76గా నమోదైంది. అలాగే నిఫ్టీ 11,666.30 పాయింట్లు 2.55 శాతం దిగజారి 304.75 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, టెకె మహీంద్రా, ఇండన్‌ ఇండ్‌ బాంక్‌, ఐసిఐసిఐ బాంక్‌, ఎస్‌బిఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. యూరప్‌లో మరోసారి కరోనా పంజా విసరడంతో.. లాక్‌డౌన్‌ దిశగా ప్రభుత్వం వెళ్లడంతో.. ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమౌతాయన్న ఆందోళనతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. అంతర్జాతీయ మార్కెట్‌తో ఉద్దీపన ఒప్పదం కుదుర్చుకోలేమంటూ అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్‌ మునుచిన్‌ వ్యాఖ్యలు కొంత కారణమయ్యాయి.