గంటా ఆస్తులను వేలం వేయనున్న బ్యాంక్

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంకు రంగం సిద్ధం చేసుకుంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో ఏప్రిల్16న ఆన్ లైన్ లో ఆస్తులను ఈ-వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ బ్యాంకు నుంచి రూ. 141.68 కోట్ల రుణం తీసుకుంది. అది ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి రూ. 200.66 కోట్లకు చేరుకుంది. రుణాన్ని చెల్లించకపోవడంతో ఆయనకు చెందిన ఆస్తులను బ్యాంకు ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆస్తులను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. గంటాతో పాటు ప్రత్యూష సంస్థకు చెందిన ఏడుగురు డైరెక్టర్ల ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేసింది.