గన్నవరం విమానాశ్రయానికి మరో లక్ష కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు

గన్నవరం విమానాశ్రయానికి మరో లక్ష కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు చేరుకున్నాయి. శనివారం పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు కోవిషీల్డ్‌ టీకా డోసులు వచ్చాయి. ముందుగా గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లను తరలించారు. అక్కడి నుండి వైద్యారోగ్య శాఖ ఆదేశాలతో ఆయా జిల్లాలకు వ్యాక్సిన్ల డోసులు తరలివెళ్లనున్నాయి.