గౌతమ్‌కి మహేశ్‌, నమ్రత సితార పుట్టినరోజు శుభాకాంక్షలు

సూపర్‌స్టార్‌ మహేశ్‌ తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని పుట్టినరోజు నేడు(ఆగస్ట్‌ 31). ఈ సందర్భంగా గౌతమ్‌కి మహేశ్‌, నమ్రతా శిరోద్కర్‌, సితార బర్త్‌ డే విషెష్‌ తెలిపారు. ”14లోకి అడుగుపెట్టిన గౌతమ్‌కి పుట్టినరోజు అభినందనలు. ఓ మంచి యువకుడిగా నువ్వు పెరిగి పెద్దవుతున్నందుకు గర్వంగా ఉంది. డొరేమాన్‌ టు అపెక్స్‌ లెజెండ్‌ వరకు నీతో కలిసి నేను జర్నీ చేయడం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టినరోజు కావాలి..హ్యాపీ బర్త్‌ డే” అని ట్వీట్‌ చేశారు మహేశ్‌.

”గౌతమ్‌ మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. మా జీవితాల్లో సంతోషం, ప్రేమను తీసుకొచ్చారు. తను ఈ ఏడాది 14 వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలాగే ప్రతి ఏడాది తన జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతూ రావాలి. నా ప్రియమైన తనయుడికి హ్యాపీ బర్త్‌ డే” అని నమ్రతా శిరోద్కర్‌ అభినందనలు తెలిపారు.

”హ్యాపీ బర్త్‌ డే అన్నయ్య.. మరో ప్రత్యేకమైన రోజు. క్రైమ్‌లో నాతో కలిసి ఉండేవాడు. కానీ.. మొదట దొరికిపోయేది తనే. నా సోదరుడిగా ఉన్నందుకు థాంక్స్‌. హ్యాపీ బర్త్‌ డే” అని సితార గౌతమ్‌కి బర్త్‌ డే విషెష్‌ తెలిపారు.