గ్రామీణ యువకుడిగా రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి రామ్‌చరణ్‌ ఫొటో ఒకటి లీక్‌ అయింది. ఈ లుక్‌లో గ్రామీణ యువకుడిగా సైకిల్‌ తొక్కుతూ అతి సాధారణంగా చరణ్‌ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ ఐఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని, రాజకీయ వ్యవస్థకు.. ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశమని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా లీక్‌ అయిన ఫొటో సినిమా కథకు సంబంధించి పలు అనుమానాలకు తెరదీస్తోంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది.