చంద్రబాబు పై మండిపడ్డ సజ్జల రామకృష్ణ రెడ్డి
చంద్రబాబు పై మండిపడ్డ సజ్జల రామకృష్ణ రెడ్డి

చంద్రబాబు పై మండిపడ్డ సజ్జల రామకృష్ణ రెడ్డి

మహమ్మారి కరోనా వైరస్‌కు సామాజిక దూరమే విరుగుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన… టీడీపీ నేతల తీరును దుయ్యబట్టారు.విపత్కర పరిస్థితుల్లో కూడా టీడీపీ రాజకీయాలు చేస్తోంది. టీడీపీ నేతలు దిక్కుమాలిన, ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. పసుపు కుంకుమ పేరుతో గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. అప్పుల భారం, వేలకోట్ల పెండింగ్ బిల్లులు రాష్ట్రానికి మిగిల్చారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు