చలికాలంలో మీ ఇంటిని ఇలా అందంగా మార్చుకోండి..

ఓ పక్క కరోనా భయంతో వీలైనంతగా ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. మరో పక్క చలితో బయటకు వెళ్ళే వీలే లేకుండా పోయింది. పచ్చని చెట్లూ, చల్లని గాలి పలకరిస్తున్నాయి. ఇంట్లో మాత్రం ఒక లాంటి తేమ, చెమ్మ, ఒక లాంటి వాసన ఉంటున్నాయి. ఇంటి లోపల కూడా బయట ఉన్న చక్కని వాతావరణం కావాలని అనుకుంటున్నారా… అప్పుడు కిటికీ లో నుండి బయటకు చూసినా, తల తిప్పి ఇంట్లోకి చూసినా అందంగా నే ఉంటుంది. అలాంటి ఇంటి డెకరేషన్ కోసం కొన్ని టిప్స్ ఇక్కడ చూద్దాం.

1. మంచి కలర్స్ యాడ్ చేయండి..

చలికాలంలో కొన్నిసార్లు మూడీగా ఉంటుంది. ఆ ఫీలింగ్ పోవాలంటే ఇల్లంతా మంచి మంచి రంగులతో నింపేయండి. సోఫాలో పిల్లోలకి రంగు రంగుల కవర్స్ వేయండి. ఫ్లవర్ వేజుల్లో మంచి ఫ్లవర్స్ పెట్టండి. ఫ్లోర్ మ్యాట్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ తో ఉన్నది సెలెక్ట్ చేయండి. వీటికి మ్యాచింగ్, లేదా కాంట్రాస్ట్ కలర్స్ థీం ఎంచుకోండి. దానికి తగినట్టు కర్టెన్స్ మార్చండి.

2. పచ్చని దుప్పట్లు

మీ బెడ్రూం ని పచ్చదనం తో నింపేయండి. ఆకులూ పువ్వులతో ఉన్న పచ్చని బెడ్ షీట్ వేయండి. బెడ్రూం వరకూ ఫ్రెష్ ఫ్లవర్స్ అమర్చుకోండి. ఫ్లవర్ ఎరేంజ్మెంట్ లో ఆకులు కూడా ఉండేట్లు చూడండి. రంగు రంగులతో మెరిసిపోయే క్విల్ట్ తీసుకోండి.

3. క్యాండిల్స్

బయట వాన పడుతున్నప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం ఎంతో రొమాంటిక్ గా ఉంటుంది. క్యాండిల్స్ ఎన్నో మంచి పరిమళాలతో లభిస్తాయి. సాంబ్రాణి, తాజా పూలు కూడా మంచి సువాసనని ఇస్తాయి కానీ, క్యాండిల్స్ తో పల్చని వెలుతురు కూడా వస్తుంది. ఇంకెందుకాలస్యం, మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఎంజాయ్ చేసేయండి.