డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా బాబూ?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్‌, డాక్టర్‌ రమేష్‌.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ అంటూ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు.మరో ట్వీట్‌లో.. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్‌ను చంద్రబాబు & కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ పగ్గాలు లాక్కుని, ఎన్టీఆర్‌నుని అవమానించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి. అంటూ విమర్శించారు.