తండ్రి కలను నిజం చేసిన ఆలీ కుమార్తె

 ‘సీతాకోక చిలుక’ చిత్రం ద్వారా చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన అలీ.. అప్పటి అగ్రకథానాయికల సరసన కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. తనకున్న బిజీ లైఫ్‌లో ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. తాజాగా అలీ ఓ గుడ్‌న్యూస్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. తన పెద్ద కుమార్తె ఫాతిమా డాక్టర్‌ అయిందని.. ఆమె తమ కుటుంబంలో మొదటి డాక్టర్‌ అని తెలియజేస్తూ.. కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. తన కుమార్తె డాక్టర్‌ కావడం అలీ కోరిక అని తెలుస్తుంది. అలీ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఫాతిమాకు కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.ఇక అలీ భార్య జుబేదా యూట్యూబ్‌లో ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చి రకరకాల రకరకాల వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం.