తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేత

కోవిడ్‌ విస్తరిస్తోన్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం టోల్‌ప్లాజాల వద్ద కఠిన ఆంక్షలను అమలుచేస్తోంది. తెలంగాణ సరిహద్దుల్లో ఎపి అంబులెన్స్‌లను నిలిపేస్తుంది. దీంతో ఒక రోగి మృతి చెందారు. ఆసుపత్రి లెటర్‌, కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అంబులెన్స్‌లు వెళ్లడానికి తెలంగాణ పోలీసులు అనుమతినిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గత రాత్రి 12 గంటల నుంచి ఎపి అంబులెన్స్‌లను తెలంగాణలోకి రాకుండా పోలీసులు నిలిపివేశారు. అంబులెన్స్‌ నిలిపివేతతో పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఒక రోగి మృతి చెందారు. సుమారు వంద అంబులెన్స్‌లు టోల్‌ప్లాజా వద్ద నిలిచిపోయాయి. బాధితులు ఎంత బతిమలాడినా పోలీసులు, వైద్యశాఖ అధికారులు ఒక్క అంబులెన్స్‌ను కూడా అనుమతించలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఓ అంబులెన్స్‌లో ఉన్న రోగి మఅతి చెందాడు.