త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న అనుష్క

అనుష్క.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెపై ఇప్పటికే ఎన్నో రూమర్స్‌ వచ్చాయి. ప్రధానంగా ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకుంటున్నారని వార్తలొచ్చాయి. ఆ వార్తలపై ప్రభాస్‌, అనుష్క ఇద్దరూ తామెప్పటికీ స్నేహితులుగానే ఉండిపోతామని.. వివాహం చేసుకోమని ఖరాఖండిగా చెప్పేశారు. ఆ తర్వాత అనుష్క దుబారుకి చెందిన ఓ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో కూడా నిజం లేదు. ఇక టాలీవుడ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కుమారుడితో ఆమె వివాహం చేసుకోకున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ వార్తలపై ఆమె స్పందించలేదు. అనుష్క పెళ్లిపై ఎలాంటి రూమర్స్‌ వచ్చినా ఆమె మాత్రం అభిమానులకు కూల్‌గానే సమాధానమిస్తూ వస్తున్నారు. అసలింతకీ అనుష్క పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలన్నింటికీ చెక్‌ పెడుతూ.. అనుష్క ్ల వచ్చే ఏడాది జూన్‌లోపే పెళ్లి చేసుకోకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా ఇండిస్టీకి చెందిన వారిని కాకుండా… బయటి వారిని పెళ్లాడబోతున్నట్లు సమాచారం.