త్వరలో మహేష్‌బాబు సోలో సాంగ్‌

 మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. పరశురామ్‌ పెట్లా రూపొందిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా నుండి కళావతి పాట విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. అయితే, సర్కారు వారి పాట నుండి అతి త్వరలోనే ఓ మాస్‌ బీట్‌ రాబోతుంది.అది టైటిల్‌ సాంగ్‌ అని సమాచారం. సంగీత దర్శకుడు థమన్‌ మంచి మాస్‌ ట్యూన్‌తో ఈ సాంగ్‌ కంపోజ్‌ చేశారు. మార్చి 18 న విడుదల చేయనున్నారు.