దివ్యాంగుల డ్యాన్స్‌ టాలెంట్‌ షో కోసం చరణ్‌ స్పెషల్‌ వీడియో…!

రామ్‌చరణ్‌ దివ్యాంగుల టాలెంట్‌ని వెలికితీసి ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ‘హీల్‌ యువర్‌ లైఫ్‌ త్రూ డ్యాన్స్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపారు. ఈ ఆన్‌లైన్‌ టాలెంట్‌ షోకు రామ్‌చరణ్‌ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. చరణ్‌తోపాటు ఈ షోలో కొరియోగ్రాఫర్స్‌ కమ్‌ డైరెక్టర్స్‌ ప్రభుదేవా, ఫరాఖాన్‌లు కూడా పాల్గనబోతున్నారు. తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టమని, అందుకే యునిక్‌ డ్యాన్స్‌ టాలెంట్‌ షోని చేస్తున్నానని రామ్‌చరణ్‌ చెప్పారు. ఈ షోలో పాల్గనాలంటే టాలెంట్‌ కలిగిన దివ్యాంగులందరూ urlife.co.in లో ఎంట్రీలను పొంది తమ వీడియోలను అప్లోడ్‌ చేయండి’ అని చరణ్‌ తెలిపారు. మెంటల్‌ డిస్టర్బ్‌ అయిన వారి వీడియోలను చూశానని.. అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని అధిగమిస్తూ వారు చూపించిన టాలెంట్‌ని చూసి ఎంతో నేర్చుకున్నానని.. దివ్యాంగ సోదర సోదరీమణులకు అందరూ గ్రాండ్‌గా వెల్కమ్‌ చెప్పి ఈ షోను సక్సెస్‌ చేయాలని రామ్‌ చరణ్‌ కోరాడు.