దేశంలో 68 వేల మార్క్‌ను దాటిన కరోనా

గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ బారి నుంచి 32,231 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,13,55,993 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,21,808 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 94.32 శాతం ఉండగా.. మరణాల రేటు 1.34 శాతం ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,13,319 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 24,18,64,161 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్స్‌ వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా వైరస్‌ టీకాల విషయానికొస్తే.. మార్చి 28 న కేవలం 2,60,653 మందికి మాత్రమే టీకా డోసులు అందాయి. ఇప్పటివరకు టీకా వేయించుకున్నవారి సంఖ్య 6,05,30,435 కి చేరింది.