నవరాత్రులు…తొమ్మిది రంగులు…ఏంటి వాటి ప్రత్యేకత?

దసరా నవరాత్రులు. భక్తులకు సందడే సందడి. పూజలు..వ్రతాలు..ఉపవాసాలు ఇలా మహిళలు దసరా పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి.

దసరా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలాత్రిపుర సుందరి .. గాయత్రి .. అన్నపూర్ణ .. మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం…

మొదటి రోజు: నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు శైలపుత్రిగా మనం దుర్గమ్మను ఆరాధిస్తాం. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. పసుపు రంగు పవిత్రకు..శుభానికి..వెలుగురు ప్రతిరూపంగా భావిస్తారు. అమ్మవారు మహిలను నిత్య సుమంగళిగా ఉండేలా దీవించమని వేడుకుంటూ పసుపు రంగు దుస్తులు ధరిస్తారు.

రెండో రోజు : బ్రహ్మచారిణిగా శక్తిని కొలుస్తాం. కనుక ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి.

మూడో రోజు: అమ్మవారి అవతారం ఈ రోజు చంద్రఘంట. బూడిద రంగు దుస్తులు ధరించాలి.

నాలుగో రోజు : దుర్గమ్మను కూష్మాండ అవతారంగా కొలుస్తాం. నారింజ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది.

ఐదవ రోజు: స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించి పూజచేయాలి.

ఆరవ రోజు: కాత్యాయనీ మాతగా అమ్మవారు కొలువుదీరే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

ఏడవ రోజు: కాళరాత్రి అవతారంతో అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుంది. ఈ రోజున నీలం రంగు దుస్తులు వేసుకోవాలి.
ఎనిమిదో రోజు: మహాగౌరీ మాతగా దుర్గమ్మని గులాబీ రంగు వస్త్రాల్లో కొలవాలి.

తొమ్మిదవ రోజు: చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందుకుంటుంది. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం అని పురాణాలు చెబుతున్నాయి.