"నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకావిష్కరణ
"నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకావిష్కరణ

“నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకావిష్కరణ

దివంగత మహానేత, మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజమమ్మ రాసిన “నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో నాన్నను చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చింది. ఇది ఒక మంచి పుస్తకం’అని పేర్కొన్నారు.వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఆయనలో చూసిన గొప్పగుణం. 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి రాయాలనిపించింది. ఆయనలోని మూర్తిభవించిన మానవత్వం​, ఆయన మాటకిచ్చే విలువ నలుగురికి తెలియజెప్పాలనిపించింది. ఆయన ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారు. ఎంతో మంది అది మాకిచ్చిన భాగ్యం అనుకుంటా. ప్రతిఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నా. నా బిడ్డల మాదిరిగా ఆయన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు తెలుసుకుని ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నా. సహృదయంతో ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నా’అని విజయమ్మ పేర్కొన్నారు.