నూతన చట్టాలు వ్యవసాయ, ఇతర రంగాల మధ్య అడ్డుగోడలు తొలుగుతాయి

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు..వ్యవసాయ, అనుబంధ రంగాల మధ్య అడ్డంకులను తగ్గించడానికి దోహదపడతాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ చట్టాలు సాంకేతిక పురోగతి, పెట్టుబుడులు పొంది, రైతులకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని ఫెడరేషన్‌ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ 93వ వార్షిక సదస్సులో భాగంగా వర్చువల్‌ సమావేశంలో ప్రసంగించారు. ఒక రంగం అభివృద్ధి చెందితే…ఆ ప్రభావం మిగిలిన రంగాలపై కూడా ఉంటుందని అన్నారు. అలా కాదని, పరిశ్రమల మధ్య అనవసరమైన గోడలు నిర్మించుకుంటే ఏం జరుగుతుందో ఊహించుకోండని, ఏ పరిశ్రమ కూడా వేగంగా అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. అటు రైతులు చేపడుతున్న ఆందోళన దృష్ట్యా…తాము తీసుకువచ్చిన చట్టాలు సరైనవేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.