దేశంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ: జగన్

దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్‌ అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీ‌ఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సందేశమిచ్చారు.  దేశంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనేనని సీఎం జగన్ చెప్పారు. ఏపీలో ప్రతి 10లక్షల జనాభాకు గాను 1,396 టెస్టులు చేస్తున్నామని, ఏపీలో కరోనా టెస్టుల సామర్థ్యాన్ని బాగా పెంచగలిగామని పేర్కొన్నారు. గతంలో ఏవైనా వైరస్‌లు వస్తే టెస్టులు చేసే పరిస్థితిలేదన్నారు. ఏపీలో ఇప్పటివరకు 74,551 టెస్టులు చేశామని తెలిపారు. ఏపీలో 9 ల్యాబ్‌లలో కరోనా టెస్టులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లను గుర్తించామని, రెడ్‌జోన్‌లో 63, ఆరెంజ్‌లో 54, గ్రీన్‌జోన్‌లో 559 మండలాలున్నాయని, రాష్ట్రంలో ఐదు చోట్ల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా ఆస్పత్రిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

క్వారంటైన్‌లో పెట్టినవారిని అన్నిరకాలుగా బాగా చూస్తున్నామని తెలిపారు. ఈనెలలోనే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల రిక్రూట్‌మెంట్‌ చేశామని, మే 15 నాటికి అన్ని ఆస్పత్రుల్లోనూ డాక్టర్లు, నర్సుల రిక్రూట్‌మెంట్ చేపడుతామని చెప్పారు. 104కు ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఆశావర్కర్లు చాలా బాగా పనిచేస్తున్నారని జగన్ కితాబిచ్చారు. దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్‌ అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీ‌ఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సందేశమిచ్చారు. 

‘‘కరోనాకు సంబంధించిన విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా కొవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. క్వారంటైన్‌లో ఉండేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మంచి ఆహారం అందిస్తున్నాం. పీపీఈలు, ఎన్‌95 మాస్కులు గతంలో ఏ ఆస్పత్రుల్లోనూ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లోనూ అవి సమృద్ధిగా ఉన్నాయని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈనెల రోజుల్లో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రతి చోటా ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. అక్కడికి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రికి చేరుస్తున్నాం. కరోనా చికిత్సకు సంబంధించిన ఆస్పత్రులకు ప్రత్యేకంగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను దాదాపుగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. 14400 ప్రత్యేకంగా టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ప్రారంభించాం. ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా కరోనా కేసులే కాకుండా మిగతా వ్యాధులకు కూడా చికిత్స అందించేలా చర్యలు చేపట్టాం. ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వడమే మాత్రమే అవసరమైన మందులను డోర్‌ డెలివరీ చేసేందుకు ఈనెల రోజుల్లేనే వ్యవస్థను తీసుకెళ్లగలిగాం. ఇప్పటికే రాష్ట్రంలో మూడు సార్లు సర్వే చేశాం. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాం. ఈ విషయంలో గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు హ్యాట్సాప్‌ చెబుతున్నా’’ అని సీఎం చెప్పారు.