పెను తుఫానుగా నివర్‌..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్‌ తుఫాను మరికొన్ని గంటల్లో పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం అర్థరాత్రికి లేదా గురువారం ఉదయానికి కరైకల్‌-మమల్లపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం కడలూరుకి 180 కిమీలు, పుదుచ్చేరికి 190 కిమీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. తుపాను గంటకు 11 కిమీల వేగంతో తీరం వైపుగా కదులుతున్నట్లు తెలిపింది. కొన్ని గంటల్లో పెను తుఫానుగా మారుతుందని తెలిపింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం 120 కిమీల నుంచి 145 కిమీల వరకు ఉంటుందని హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరింది.