పెళ్లి పీటలెక్కనున్న కత్రినాకైఫ్‌

బాలీవుడ్‌ ప్రేమికులు కత్రినాకైఫ్‌, నటుడు విక్కీకౌశల్‌ త్వరలో పెళ్లి పీటలెకక్కనున్నారు. వీరి పెళ్లి డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ వేడుక కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగరోజున వీరి పెళ్లి తంతు కంటే ముందు జరిగే రోకా వేడుక జరిగిందని ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోకా వేడుక కత్రినాకు ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో జరిగిందట. ఈ వేడుకలో కత్రినా తల్లి సుజానే టర్కోయెట్‌, సోదరి ఇసాబెల్‌ పాల్గొన్నారు. అలాగే విక్కీ తల్లిదండ్రులతోపాటు, సోదరుడు సన్నీ కౌశల్‌ పాల్గొని వివాహానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారట. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు ఖరీదైన బహుమతుల్ని ఇచ్చిపుచ్చుకున్నారట.