ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు

ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు: జగన్‌

రానున్న 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేసి, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి 104 వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణా చర్యలపై సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనుమానం ఉన్న వారి నుంచి నమూనాలు తీసుకోవడంతో పాటు, మధుమేహం, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి, అక్కడే మందులు కూడా ఇవ్వాలన్నారు. ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామంలో 104 ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు