ప్రముఖ హాస్యనటుడు జగదీప్‌ మృతి

బాలీవుడ్‌ హాస్యనటుడు జగదీప్‌ (81) అలియాస్‌ సయ్యద్‌ ఇష్తియాక్‌ అహ్మద్‌ జాఫ్రీ మృతి చెందారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుముశారు. మార్చి 29, 1939న జగదీప్‌ జన్మించారు. ఆయనకు కుమారులు జావేద్‌ జాఫ్రీ, నవేద్‌ జాఫ్రీ ఉన్నారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మతికి బాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. 400లకు పైగా సినిమాల్లో నటించిన జగదీప్‌ 1975లో వచ్చిన ‘షోలే’లో సూర్య భోపాలి పాత్ర పోషించారు. ఆ పాత్ర పేరుతో వచ్చిన ‘సూర్య భోపాలి’ సినిమాకు దర్శకత్వం వహించారు కూడా! అందాజ్‌ అప్నా, బ్రహ్మచారి, నాగిన్‌ వంటి సినిమాల్లో నటించారు.