ప్రేమలో పడిన అమీర్‌ఖాన్‌ కుమార్తె

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నపూర్‌… ఐరాఖాన్‌కు కూడా లాక్‌డౌన్‌ నుంచి ఫిట్‌నెస్‌ కోచ్‌గా మారారు. ఈ క్రమంలోనే నపూర్‌ వ్యక్తిత్వం ఐరాకు నచ్చడంతో.. అతనితో ప్రేమలో పడినట్లు… వీరిద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్నటు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రేమ విషయాన్ని ఐరా తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమీర్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం. వీరిద్దరికీ సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల ఐరాఖాన్‌ లైంగిక వేధింపుల వల్ల ఎంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు స్వయంగా వీడియో ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.