ప్రేమ వివాహం చేసుకోబోతున్న ప్రభుదేవా

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా మరోసారి వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభుదేవా తన భార్య రామలతతో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రభుదేవా ప్రముఖ హీరోయిన్‌ నయనతారని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి… కానీ పెళ్లి జరగలేదు. తాజాగా ప్రభుదేవా తన బంధువునే ప్రేమించారని, ఆమె కూడా అతని ప్రేమను అర్థం చేసుకుందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ప్రభుదేవా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘దబాంగ్‌ 3’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘రాధే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.