ఫార్ములా మారుతోంది..!

క్లిష్ట పరిస్థితులెప్పుడూ కొత్త అవకాశాలకు దారులు తెరుస్తాయి. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వినోదరంగం మరిన్ని వేదికలుగా విస్తరిస్తోంది. ఓటిటి అందుకు ఉదాహరణ. పెద్ద పెద్ద బడ్జెట్లతో, ఘనమైన తారాగణంతో పనిలేకుండా ఔత్సాహిక దర్శక నిర్మాతలు, కథకులూ మెరుగైన ప్రయోగాలు చేసే అవకాశం ఏర్పడింది. థియేటర్లు దొరుకుతాయా? లేదా? అన్న చింత లేదిక. అగ్రనటుల ఉరవడిలో కనీసం చిన్న చోటైనా దొరుకుతుందా అన్న బెంగ అక్కర్లేదిక. ఆల్రెడీ … ఆ ప్రయత్నం మొదలైంది. షార్ట్‌ ఫిలిమ్స్‌ పేరిట వందలు వేలుగా యూట్యూబ్‌లో క్రియేటివిటీని పోగేస్తున్న సృజనకారులకు ఓటిటి ఇక డబ్బులను కూడా తెచ్చిపెట్టొచ్చు. అది చాలా మందికి గొప్ప ప్రోత్సాహం కూడా అవ్వొచ్చు.