బస్సులో సమంత, నయన్‌తార

స్టార్‌ కథానాయకులు సమంత, నయనతార నటిస్తున్న తమిళ చిత్రం కాతువకుల రెండు కాదల్‌ అనే సినిమా తెరకెక్కుతోంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని నయన్‌ బాయ్ ఫ్రెండ్‌, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ వీడియో ఒకటి నెటింట్లో వైరల్‌గా మారింది. బస్సులో హీరో, హీరోయిన్లు ప్రయాణీస్తున్న ఈ సీన్‌ను పలువురు మొబైల్లో తీసి..సోషల్‌ మీడియాలో పెట్టడంతో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సమంత, నయన్‌ ఇద్దరూ కూడా తెల్ల రంగు చీరలు కట్టుకుని బస్సు ఫుట్‌బోర్డుపై ఉండగా …వారి వెనుక విజయ్ సేతుపతి కూడా కనిపిస్తున్నారు. విఘ్నేష్‌ ఈ సినిమా గురించి ప్రకటించగానే… సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.