‘బైరెడ్డి’గా మెగాస్టార్‌

మోహన్‌లాల్‌ నటించిన మలయాళ మూవీ ‘లూసిఫర్‌’ .. తెలుగులో రీమేక్‌ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ నటించిన పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘బైరెడ్డి’గా టైటిల్‌ ఖరారు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ స్టీఫెన్‌ గట్టుపల్లి, ఎ.బి రామ్‌ ఖురేషి అనే రెండు పాత్రల్లో నటించారు. చిరంజీవి కూడా రాయలసీమ ప్రాంతంలో పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌గాను, మాఫియా లీడర్‌గాను రెండు పాత్రల్లో నటించబోతున్నారట. లూసిఫర్‌ చిత్రాన్ని పృథ్విరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో మొదట వి.వి వినాయక్‌ పేరు వినిపించినా తర్వాత ఆయన స్థానంలో తమిళ దర్శకుడు మోహన్‌రాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్‌రాజా తెలుగులో ‘హనుమాన్‌జంక్షన్‌’ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే.. ‘బైరెడ్డి’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు.