మరో వివాదంలో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ

జక్కన్న మ్యాగమ్‌ ఓపస్‌ మూవీ ”ఆర్‌ఆర్‌ఆర్‌” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్‌ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ స్క్రీన్‌ స్పేస్‌ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కొమరం భీమ్‌ గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకఅష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్‌ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్‌ వారితో పోరాడిన అల్లూరిని.. వారితో కలిసి పని చేసే పోలీసు అధికారిగా మేకర్స్‌ ఎలా చూపిస్తారని కమ్యూనిస్టు నాయకుడు ప్రశ్నించారు. మాతఅభూమి కోసం ప్రాణత్యాగం చేసిన నిజమైన దేశభక్తుడు అల్లూరి. కానీ మేకర్స్‌ మాత్రం ఇంకోటి చూపిస్తున్నారని రామకఅష్ణ అన్నారు.