మహాశివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తుల సౌకర్యార్ధం 120 అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రజా రవాణా శాఖ (ఆర్‌టిసి) డిప్యూటీ కమిషనరు జి.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రజా రవాణా శాఖ (ఆర్‌టిసి) కార్యాలయంలోని డిప్యూటీ కమిషనరు ఛాంబరులో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జి.వరలక్ష్మి మాట్లాడుతూ… మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అదనంగా 120 ప్రత్యేక బస్సులను వేశామని తెలిపారు. గతేడాది శివరాత్రి సందర్భంగా 100 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం 1, 2 వ డిపోలు, పాలకొండ నుండి రామతీర్ధాలకు 60 బస్సులు, శ్రీకాకుళం నుండి శ్రీముఖలింగం దేవాలయానికి 10 బస్సులు, పలాస నుండి సాబకోటకు 40 బస్సులు, టెక్కలి నుండి రావివలసకు 10 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.