మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తా
మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తా

మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తా

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడమే కాదని విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ది హిందు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియం ప్రస్తావన తెచ్చారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతామన్నారు.ప్రైప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని మాకు తెలుసు. ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఇంగ్లీష్‌ మీడియాన్ని తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫోటోలు తీసి వచ్చే మూడేళ్లలో వాటి రూపురేఖలను మార్చబోతున్నాం అని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.