మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు
మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. .కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్‌డౌన్‌ రెండో దశ ఏప్రిల్‌ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ మూడో దశ మే 4 నుంచి మే 17 వరకు ప్రకటించింది. దీంతో మొత్తం 56 రోజులు భారత్‌లో లాక్‌డౌన్‌ విధించినట్టయింది. అయితే మూడో దశలో కరోనా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇచ్చారు.