మై డియర్ ఫ్రెండ్.. చిరుకు మోహన్ బాబు బర్త్‌డే విషెస్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ రెండు పండగలు చేసుకుంటున్నారు. వినాయక చవితితో పాటు ఇవాళ ఆయన తన పుట్టినరోజు వేడుకల్ని కూడా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరుకు కుటుంబ సభ్యులతో పాటు.. టాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు చిరుకు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.