‘రాధే శ్యామ్‌’లో కృష్ణంరాజు

రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియాడిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ రొమాంటిక్‌ డ్రామా ‘రాధే శ్యామ్‌’ చిత్రం నుంచి తాజాగా ఒక పోస్టర్‌ ను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. కృష్ణంరాజు ఈ చిత్రంలో పరమహంస పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసారు. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌, యూ వీ క్రియేషన్స్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తుండగా, జస్టిన్‌ ప్రభాకరన్‌ తెలుగు వెర్షన్‌ కి సంగీతం అందిస్తున్నారు. మిథున్‌, అమాల్‌ మల్లిక్‌ లు హిందీ వెర్షన్‌ కి సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.