రామ్ తో జత కడుతున్న కృతిశెట్టి

రామ్‌ హీరోగా ఎన్‌.లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం విదితమే. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.6గా తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. స్టైలిష్‌ ఎలిమెంట్స్‌తో, మాస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా, లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో, భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో రామ్‌ 19 చిత్రం నిర్మితమవుతోంది.