రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితా విడుదల
రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితా విడుదల

రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితా విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్చుతామని కేంద్రం పేర్కొంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి రెండు జాబితాలుగా విభజించింది
ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌ జాబితాలో చేర్చింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది.
ఏపీలో రెడ్‌జోన్‌ జిల్లాల వారిగా

కర్నూలు
గుంటూరు
నెల్లూరు
ప్రకాశం
కృష్ణా
వైఎస్‌ఆర్‌ కడప
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
చిత్తూరు
విశాఖపట్నం
అనంతపురం
ఇక తెలంగాణలో ఎనిమిది జిల్లాలను రెడ్‌జోన్‌ జాబితాలో చేర్చింది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. హాట్‌స్పాట్‌ క్లస్టర్‌గా నల్లగొండ జిల్లాను కేంద్రం గుర్తించింది.
తెలంగాణలో రెడ్‌జోన్‌ జిల్లాలు

హైదరాబాద్‌
నిజామాబాద్‌
వరంగల్‌ అర్బన్‌
రంగారెడ్డి
జోగులాంబ గద్వాల
మేడ్చల్‌
కరీంనగర్‌
నిర్మల్‌
తెలంగాణలో 19 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌ల జాబితా
సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు ఉన్నాయి.