రేపు కేసీఆర్ బహిరంగ సభ

రేపు సీఎం కేసీఆర్ హాలియా బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 2014 లో 2 రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగితే ఇవాళ 12 లక్షల మెట్రిక్ టన్నులధాన్యం ఇచ్చే స్థితికి నల్గొండ జిల్లా చేరుకుందని అన్నారు. రాష్ట్రంలోనే అధికంగా సాగుబడి చేస్తున్న జిల్లా నల్గొండ జిల్లా అని పేర్కొన్న ఆయన ఉమ్మడి జిల్లాలో ప్రతి ఇంచుకు నీరిచ్చేందుకు  సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు ఉపయోగ పడ్డాయని అన్నారు. కాళేశ్వరం ద్వారా మొదట ఫలితం పొందింది ఉమ్మడి నల్గొండ జిల్లానేనని, జిల్లాలో జరిగిన అభివృద్ధి రైతాంగానికి సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పేందుకే హాలియాలో సీఎం సభ అని ఆయన అన్నారు. రేపు హాలియలో జరిగే సీఎం సభకు సాగర్ ఉప ఎన్నికకు ఎలాంటి సంబంధం లేదని, ఎడమ కాలువ పై 60 ఏళ్లుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి మేము చేసిన  ప్రయత్నాలు ఫలించాయని అన్నారు.