రైతుల ఆందోళనపై సల్మాన్ స్పందన

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే రైతుల డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. పోలీసులు, రైతుల మధ్య హింసాత్మక ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖులు స్పందిస్తున్నారు. సినిమాలు వాళ్ళు కూడా ఈ వివాదం పట్ల అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. “ఏది స‌రైన‌దో ఆ ప‌ని చేయాలి. అందరికీ ఉపయోగపడే తెలివైన నిర్ణయం తీసుకోవాలి” అని సల్మాన్ తెలిపాడు. కాగా, కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది. కొందరు ఆందోళనను తప్పుబడుతుంటే మరికొందరు మద్దతిస్తున్నారు.