వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పుతాం : కేజ్రీవాల్‌

 ఢిల్లీలో కోవిడ్‌ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆక్సిజన్‌ కొరత ఏర్పడంతో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల నుండి ఆక్సిజన్‌ ట్యాంకర్లు, ప్లాంట్లను దిగుమతి చేసుకుంటోంది. దేశ రాజధానిలో వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం తెలిపారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల కొరత ఉందని, ఈ సమస్యను తగ్గించడానికి బ్యాంకాక్‌ నుండి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తక్షణమే వినియోగించేలా 21 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఫ్రాన్స్‌ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎనిమిది ఆక్సిజన్‌ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేస్తుండగా.. 36 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.