విశాఖ ఉక్కును అమ్మే తీరతాం.. నిర్మలా సీతారామన్‌

విశాఖ ఉక్కు కోసం ఓవైపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నా.. కేంద్రానికి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదు. పైగా విశాఖ ఉక్కును అమ్మేస్తామని, 100శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. లోక్‌సభలో వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణ లేవనెత్తిన ప్రశ్నపై ఆమె స్పందిస్తూ.. విశాఖ ఉక్కు వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని బదులిచ్చారు. మెరుగైన ఉత్పత్తి కోసమే ప్రయివేటీకరిస్తున్నట్లు సమర్థించుకున్నారు.