వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక భూములమీద లిటిగేషన్‌ లేని పరిస్థితి వస్తుందని, ఆ ప్రక్రియ చేయడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే చేపట్టామని, తొలిదశలో 50 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. మంగళవారం నుంచి 37 గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. రాబోయే 3 వారాల్లో మిగతా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు.