రాజమౌళి బాహుబలి కంటే ముందే సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన కూడా మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఆ సినిమా కథ ఏంటీ.. ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటివరకు సమాచారం లేదు. కాగా, సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రాజమౌళి వాళ్ల నాన్న విజయేంద్రప్రసాద్ ఛత్రపతి శివాజీ ముఖ్యపాత్రగా కథ రచిస్తున్నట్లు.. అందులో మహేష్ శివాజీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే శివాజీ పాత్రకు మహేష్‌బాబు సరిగ్గా సరిపోతారని.. అందుకు రాజమౌళి కూడా మహేష్‌బాబునే ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. దీనికి మహేష్‌బాబు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై రాజమౌళి కానీ, మహేష్‌బాబు కాని అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే మహేష్‌బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణకు కూడా ఛత్రపతి శివాజీ పాత్ర చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉండేదట.ఆయన నటించిన ‘నెంబర్ వన్’ సినిమాలో ఓ పాటలో శివాజీ గెటప్‌లో కనిపించినా పూర్తిస్థాయిలో నటించలేదని బాధ ఉండేదట. దీన్నిబట్టి చూస్తే తన కోరికను కొడుకు మహేష్‌బాబు తీర్చబోతున్నట్లు తెలుస్తోంది.