హైదరాబాద్‌ టు ముంబయి. బుల్లెట్‌ ట్రైన్‌కు ప్రణాళికలు

హైదరాబాద్‌-ముంబయిని కలుపుతూ బుల్లెట్‌ రైలును నడిపేందుకు కేంద్రం యోచిస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఒక రైలు మార్గాన్ని హైదరాబాద్‌ నుంచి ముంబయికి నిర్మించనుంది. ఈ ఏడు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. దేశంలో తొలి బుల్లెట్‌ రైలు నిర్మాణ పనులను ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. 508.17 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం. రూ.1.08 లక్షల కోట్లుగా నిర్ణయించారు.