11న ఒటిటిలో నిజల్‌

నయనతార కొత్త చిత్రం ఒటిటి విడుదలకు సిద్ధమైంది. ఆమె తాజాగా నటించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ‘నిజల్‌’. ఈ చిత్రంలో నయనతారతో పాటు చాకో బోబన్‌ ప్రధాన పాత్రలో నటించారు. సైజు కురుప్‌, దివ్య ప్రభ, రోనీ డేవిడ్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అప్పు ఎన్‌ భట్టతిరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజల్‌’ చిత్రం మే 11న ‘సింప్లి సౌత్‌’ అనే ఒటిటి వేదికపై విడుదల కానుంది.