1,218కు చేరిన కరోనా మృతుల సంఖ్య
1,218కు చేరిన కరోనా మృతుల సంఖ్య

1,218కు చేరిన కరోనా మృతుల సంఖ్య

కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా బారినపడినవారి సంఖ్య శనివారానికి 37,336కు చేరగా, ఇప్పటివరకూ 1,218 మృతి చెందారు. అలాగే 26,167 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,950 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2293 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 71మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం ఓ ప్రకటన చేసింది.