13న టీపీసీసీ నేతల ‘గోదావరి జలదీక్ష’

గోదావరి నదిపై కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఈ నెల 13న సందర్శించి వాటి పురోగతి విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేస్తామని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయ న పార్టీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలతో ఫోన్‌ ద్వారా గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టుల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13న గోదావరి నదిపైన ఉన్న ప్రాజెక్టులను సందర్శించి అక్కడ స్థానిక మీడియా తో ప్రాజెక్టు స్వరూపం గురించి మాట్లాడతామని తెలిపారు