13వేలకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు
13వేలకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

13వేలకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23 మంది మృతి చెందారు. మరోవైపు ఇప్పటి వరకు వైరస్‌ నుంచి కోలుకుని 1749 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.